Breaking News

ఓ బాలుడు బడంగ్‌పేట్‌లో అదృశ్యమై గోవాలో ప్రత్యక్షం


 ఓ బాలుడు బడంగ్‌పేట్‌లో అదృశ్యమై గోవాలో ప్రత్యక్షమైన ఘటన మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం బడంగ్‌పేట్‌లోని గ్రీన్‌ విచ్‌ అవెన్యూ మాతఛాయ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న రాఘవేంద్రరావు కొడుకు ఆర్యన్‌ విష్టు(14) ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం సాయంత్రం ట్యూషన్‌ కు వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాలేదు. ట్యూషన్‌ సార్‌కుకాల్‌ చేయగా రాలేదని చెప్పడంతో చుట్టుపక్కల, బంధువుల దగ్గర వెతికినా కనిపించలేదు. దీంతో మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అదశ్యమైన ఆర్యన్‌ విష్ణు గోవాలో ఓ హోటల్‌ నుంచి కర్నాటకలో ఉంటున్న తన మామకు ఫోన్‌ చేయడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.