Breaking News

తమిళనాడు గవర్నర్‌కు సుప్రీం ప్రశ్న


 మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రెండేండ్లుగా పెండింగ్ లో ఉంచడంపై తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో తనకు పడిన జీవిత ఖైదు శిక్షను సీబీఐ నేతృత్వంలోని మల్టీ డిసిప్లినరీ మానిటరింగ్ ఏజెన్సీ దర్యాప్తు పూర్తయ్యే వరకు నిలిపేయాలని దోషి ఏజీ పెరరివళన్ ఫైల్ చేసిన పిటిషన్ పై సుప్రీం మంగళవారం విచారణ చేపట్టింది. క్షమాభిక్ష పిటిషన్​పై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్​ను కోర్టు కోరగలదా? అని జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిల డివిజన్ బెంచ్ పిటిషనర్ తరఫు లాయర్ ను ప్రశ్నించింది.