Breaking News

రాజాసింగ్ ఇంట తీవ్ర విషాదం


 బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకంది. రాజా సింగ్ మేనల్లుడు రోహిత్ సింగ్(19) ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు. రాజాసింగ్ బావ మరిది మనీష్ సింగ్ కుమారుడు రోహిత్ సింగ్. వీరి కుటుంబం కూడా రాజా సింగ్ కుటుంబంతోనే కలిసి ఉంటున్నారు.

కాగా గత రాత్రి 8: 30 గంటల సమయంలో రాజాసింగ్ ఇంట్లోనే రోహిత్ సింగ్ ఉరి వేసుకున్నాడు. కాగా అతని ఆత్మహత్యకు గల కారణాలేవీ తెలియరాలేదు. ఈరోజు ఉదయం రోహిత్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టుగా బీజేపీ గోషామహల్ ఇంచార్జి ఓ ప్రకటన ద్వారా తెలియజేసారు.