Breaking News

వార్షిక ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు తక్కువే : ఎఫ్‌ఏడీఏ


 దేశంలో గత రెండు, మూడు నెలలుగా వాహన అమ్మకాలు పెరిగాయనే ఆయా కంపెనీలు, పరిశ్రమ వర్గాల రిపోర్టులు వట్టివేనని స్పష్టం అవుతోంది. గడిచిన అక్టోబరు ప్యాసింజర్‌ వాహనాల(పీవీ) విక్రయా లు ఏడాది ప్రాతిపదికన దాదాపు 9 శాతం మేర పతనమై 2,49,860 యూనిట్లకు పరిమితమైనట్టు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) వెల్లడిం చడమే ఇందుకు నిదర్శనం. గతేడాది ఇదే నెలలో అమ్ము డైన 2,73,980 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. వాణి జ్య వాహన విక్రయాలు 30 శాతం పతనమై 44,480 యూనిట్లకు పరిమితమయ్యాయి. పండుగ సందర్భంగా వాహన రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నప్పటికీ., వార్షిక ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు తక్కువగానే నమోదయ్యాయని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ వింకేష్‌ గులాటి తెలిపారు.