Breaking News

ఈ ముద్దుగుమ్మ మానసిక సమస్యతో బాధపడుతోందట.


 నేల టిక్కెట్ సినిమాలో రవితేజాకు హీరోయిన్‌గా చేసిన మాళవికా శర్మ ఆ సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తుంది. అంతేకాకుండా రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రెడ్‌లో కూడా చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా పూర్తకాకముందే ఈ అందాల రాసికి మరో రెండు ఆఫర్లు క్యూలో ఉన్నాయి. వచ్చే వేసవిలోపు మరో రెండు తెలుగు సినిమాల్లో మాళవికా చేయనుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవికా ఇటీవల ఫాన్స్‌కు గుండె పగిలే నిజాన్ని ఎంతో సింపుల్‌గా నవ్వుతూ చెప్పేసింది. ఆమె మానసిక రుగ్మత గురించి అభిమానులకు తెలిపింది. దీంతో ఆమె అభిమానులు ఆశ్యర్యపోయారు. ఈ ముద్దుగుమ్మ క్లెప్లమెనియాక్ అనే చిత్రమైన మానసిక సమస్యతో బాధపడుతోందట.

ఈ సమస్య ఉన్న వారికి చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలని అనిపిస్తుందట. ఏదైనా వస్తువు కళ్ల ముందు కనిపిస్తే చాలు దాన్ని దొంగతనం చేయాలని మనసు తెగ పీకులాడుతుంది. ఇది చాలా అరుదుగా ఉంటుంది. ఈ రోగం దాదాపు అందరిలో ఉన్నా, అంత సమస్యగా మారదు. కానీ ఒక హీరోయిన్‌కు ఇది ఉండటం చిన్న విషయం కాదు. ఈ సమస్య కారణంగా తాను ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డానని మాళవిక చెప్పింది. తన వెంట ఎవరైన ఉండి ఎప్పటికప్పుడు తన మనసును పక్క దారి పట్టిస్తూ ఉండటంతో పాటు నా మానసి స్థితిని గుర్తు చేస్తుంటారని మాళవిక చెప్పింది