Breaking News

రోహిత్ శర్మ ను మొదట ఎంపిక చేయలేదు


 భారత జట్టు కరోనా లాక్ డౌన్ తర్వాత ఆడబోతున్న మొదటి అంతర్జాతీయ సిరీస్ అయిన ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ ను మొదట ఎంపిక చేయలేదు. దాంతో బీసీసీఐ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే అతకముందు ఐపీఎల్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ గాయపడ్డాడు. కానీ ఆ గాయం తీవ్రత గురించి ఎటువంటి ప్రకటన రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు రోహిత్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అలాగే ఐపీఎల్ లో చివరి మూడు మ్యాచ్ లు ఆడి తాను ఫిట్ గా ఉన్నాను అని తెలిపాడు. దాంతో మాజీ ఆటగాళ్లు, అభిమానులు ఇంత కీలక పర్యటనకు హిట్ మ్యాన్ ను ఎందుకు సెలక్ట్ చేయలేదు అని బీసీసీఐని ప్రశ్నించారు. అప్పుడు మళ్ళీ జట్లలో మార్పులు చేస్తూ రోహిత్ ను టెస్ట్ జట్లలోకి తీసుకున్నారు.


అయితే తాజాగా రోహిత్ గాయం పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ... రోహిత్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సంపాదించలేదు. ప్రస్తుతం అతను కేవలం 70 శాతం మాత్రమే ఫిట్ గా ఉన్నాడు. అయిన ఐపీఎల్ మ్యాచ్ లలో ఎందుకు ఆడాడో అతడినే అడగాలి అని దాదా తెలిపాడు.