Breaking News

మెంతులతో షుగర్ కి చెక్...


 భారతదేశం ఔషధాల భూమి. ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో దొరకని మందు లేదు. నయం కాని జబ్బు లేదు. ఈ లోకంలో అత్యంత ప్రమాదకరమైన రోగాలలో షుగర్ వ్యాధి ఒకటి. ఒక్కసారి వచ్చిందంటే చనిపోయేదాకా ఈ వ్యాధి వదలదు. శరీరాన్నంతా పీక్కు తినేస్తుంది ఈ వ్యాధి. ఒక సర్వే ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో షుగరు వ్యాధితో బాధ పడే వారు ప్రతి 10 మందిలో 6 గురు ఉంటారంటే ఈ వ్యాధి తీవ్రత ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇక వ్యాధికి మందైతే లేదుగాని కంట్రోల్ చేసుకునే మార్గాలు వున్నాయి. మన వంటింట్లో దొరికే మెంతులతో దీన్ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.


రోజూ 10 గ్రాముల మెంతులను వేడి నీటిలో నానబెట్టి తాగినట్లయితే టైప్-2 డయాబెటీస్‌ను నియంత్రించవచ్చు.

మెంతుల్లో రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణం ఉందని స్టడీలో తేలింది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది. కార్బోహైడ్రేట్లు, చక్కెరలను ఇది సంగ్రహిస్తుంది.మెంతుల్లో ఉండే 4-హైడ్రోక్సీసొలేయూసీనే అనే అమినో యాసిడ్లలో యాంటీ డయాబెటిక్‌లు ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. ఫలితంగా రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.