Breaking News

ప్రభుదేవా త్వరలో మరో పెళ్లి


 కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభుదేవా త్వరలో మరో పెళ్లి చేసుకోనున్నాడనే వార్త కోలీవుడ్ నాట జోరుగా వినిపిస్తోంది. మేన కోడలు వరుస అయ్యే శోభ అనే అమ్మాయితో కొద్దిరోజులుగా రిలేషన్‌లో ఉన ప్రభుదేవా, ఆమెను త్వరలోనే పెళ్లాడబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల పై ప్రభుదేవా నుంచి ఎలాంటి స్పందన లేదు.

1995లో ప్రభుదేవా, రమాలత్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత నయనతారతో ప్రేమలో పడ్డ ప్రభుదేవా తన భార్య రమాలత్‌కి విడాకులు ఇచ్చాడు. నయనతారను ప్రభుదేవా పెళ్లి చేసుకుంటాడని జోరుగా ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వలన వీరిద్దరూ విడిపోయారు.

దీంతో అప్పటి నుంచి ఆయన సింగిల్‌గా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుదేవా మళ్ళీ వివాహం చేసుకోనున్నాడని ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తోంది.