Breaking News

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం నిలిపివేత


 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కరవు భత్యాన్ని నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరవు భత్యాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 2021 జులై వరకు చెల్లింపులతో పాటు 2021 జనవరి నుంచి చెల్లించాల్సిన కరవు భత్యాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.