Breaking News

నాగచైతన్య న్యూలుక్


 శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగ చైతన్య నటిస్తున్న సినిమా 'లవ్ స్టోరి'. ఈ క్రమంలో నాగచైతన్య పుట్టిన రోజును పురస్కరించుకుని సోమవారం సినిమా నుంచి నాగ చైతన్య న్యూలుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సాయిపల్లవి నటిస్తున్నారు. కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'లవ్ స్టోరి' సినిమాకు పవన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. థియేటర్లు ఓపెన్ కాగానే సినిమాను విడుదల చేయనున్నారు. పుట్టిన రోజు సందర్భంగా నాగచైతన్యకు దర్శక, నిర్మాతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'లవ్ స్టోరి' నుంచి విడుదలైన న్యూలుక్ లో నాగ చైతన్య లుంగీ, బనియన్ తో కనిపిస్తూ ఆకట్టుకున్నారు.

గ్రామీణ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'లవ్ స్టోరి'లో నాగచైతన్య గ్రామీణ యువకుడిగా కనిపించనున్నట్టు ఆయన న్యూలుక్ ను చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 'లవ్ స్టోరి' సినిమాపై నాగచైతన్య భారీ ఆశలు పెట్టుకున్నారు