Breaking News

బిహార్‌లో నేడే చివరి విడత ఎన్నికలు...


 మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. చివరి విడతగా జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం 78 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1,204 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఛత్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ బీజేపీ నేత,దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధువు నీరజ్ కుమార్ సింగ్‌తో పాటు బిహారీగంజ్‌ నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కుమార్తె,కాంగ్రెస్ అభ్యర్థి సుభాషిణి శరద్ యాదవ్,బిహార్ అసెంబ్లీ స్పీకర్,జనతాదళ్ అభ్యర్థి వినయ్ కుమార్ చౌదరి,ముజఫర్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి,బీజేపీ అభ్యర్థి సురేశ్ కుమార్ శర్మల భవితవ్యాన్ని ఈ ఎన్నికల్లో ఓటర్లు డిసైడ్ చేయనున్నారు.