Breaking News

హైదరాబాద్‌లో మరో మోసం


 హైదరాబాద్‌లో మరో మోసం భయట పడింది. అబిడ్స్‌లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట భారీ మోసానికి తెరలేపారు కొందరు మోసగాళ్లు. హైపూ నెక్‌స్ట్ పేరిట ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారు నిర్వాహకులు. రూ.2 కోట్లు వసూలు చేసిన అక్రమార్కులు.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు అంటూ ప్రచారం చేశారు. ఈ కేసులో గుజరాత్‌కు చెందిన కుమావత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.చైన్ సిస్టమ్ ద్వారా దేశవ్యాప్తంగా రూ.2 కోట్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గుజరాత్ ఒకరితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు గతంలో మరింకేమైన మోసాలు చేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఉచ్చులో ప్రజలు పడకుండా ఉండాలని కోరారు. ఇలాంటి ఈజీ మనీ ఆశలో పడితో మోసం గ్యారెంటీ అని పోలీసులు హితవు పలికారు.