Breaking News

తెలంగాణాలో తగ్గిన కరోనా కేసులు..


 తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య స్వల్పనగా తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 862 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 961 మంది రికవరీ అయ్యారు. మరో ముగ్గురు కరోనాబారినపడి మృతిచెందారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,66,904కు చేరుకోగా.. ఇప్పటి వరకు 2,54,676 మంది కరోనాబారినపడి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. 1,444 మంది మృతిచెందారు.

దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతానికి తగ్గిపోయిందని.. రికవరీ కేసుల సంఖ్య దేశంలో 93.7 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 95.41 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం రాష్ట్రంలో 10,784 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇక, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41,101 కరోనా టెస్ట్‌లు చేశామని.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 52,89,908కు పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.