Breaking News

ఆ ఫోన్ పై భారీ తగ్గింపు..


 మొబైల్ ప్రియులకు భారీ శుభవార్త.. దీపావళి పండుగ సందర్భంగా కొత్త కొత్త ఆఫర్ల తో మొబైల్ కంపెనీలు కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు..రోజుకో కంపెనీ ధరలను అదుపు చేస్తూ అదిరిపోయే ఫీచర్లు ఉన్న కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఇప్పటికే చాలా కంపెనీలకు సంబంధించిన ఫోన్లు మార్కెట్ లో లాంఛ్ అయ్యి సందడి చేస్తున్నాయి. తాజాగా మరో మొబైల్ కంపెనీ సరికొత్త ఫీచర్స్ లో మార్కెట్ లోకి కొత్త ఫోన్ ను విడుదల చేసింది.. ఆ ఫోన్ ప్రత్యేకతలు,ధర వంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..


విషయానికొస్తే.. శాంసంగ్ ఈ సంవత్సరం జులైలో శాంసంగ్ గెలాక్సీ ఎస్20+ బీటీఎస్ ఎడిషన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు దీని ధరను భారీగా తగ్గించారు. లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ధర రూ.87,999గా ఉండగా, ఇప్పుడు రూ.77,999కు తగ్గించారు. అంటే దీనిపై రూ.10 వేలు తగ్గించారన్న వార్తలు వినిపిస్తున్నాయి..ఈ ఫోన్ శాంసంగ్ ఆన్లైన్ స్టోర్ లలో కానీ, శాంసంగ్ మొబైల్ స్టోర్ లలో కానీ అందుబాటులో ఉందట..పర్పుల్ గ్లాస్, మెటల్‌తో రూపొందించబడింది. ఇందులో ముందుగానే బీటీఎస్ థీమ్స్, ఫ్యాన్ కమ్యూనిటీ ఫోరంను ఇన్ స్టాల్ చేసి ఉంచుతారు. బాక్స్‌లో ఫోన్‌ను అలంకరించుకోవడానికి స్టిక్కర్లను కూడా అందిస్తారు...

ముఖ్యంగా ఈ ఫోన్ లో ఆకర్షించడానికి కారణం కెమెరా..64 మెగా పిక్సెల్ టెలిఫొటో లెన్స్, 12 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, మరో 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. వీటితో పాటు 0.3 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ను, దానితో పాటుగా 10 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.120 హెర్ట్జ్ డిస్ ప్లే, హెచ్ డీఆర్ 10 సర్టిఫికేషన్ లు ఇందులో కూడా ఉన్నాయి. 4,500 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో అందించారు. 25W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఇందులో ఉంది. ఎల్టీఈ వెర్షన్ లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను ఉంచారు. 999 ప్రాసెసర్ ను ఈ ఫోన్ కు అందించారు.. ఎటూ చూసిన ఈ ఫోన్ కు ప్రత్యేకతలతో మొబైల్ ప్రియులను ఆకర్షిస్తుంది..