Breaking News

సాహిత్య అకాడమీలో ఉద్యోగాలు..


 నిరుద్యోగులకు సాహిత్య అకాడమి శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అసిస్టెంట్ ఎడిటర్, Sales-cum-Exhibition Assistant, సీనియర్ లైబ్రరీ&ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, స్టెనోగ్రఫర్, ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీని చేయనున్నట్లు సాహిత్య అకాడెమీ తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 ఆఖరు తేదీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సాహిత్య అకాడమీ వెబ్ సైట్ నుంచి దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ దరఖాస్తును నింపి పోస్టు చేయాల్సి ఉంటుంది. సాహిత్య అకాడెమీ Ministry of Culture కింద నిర్వహించబడుతున్న ఓ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ.

అప్లికేషన్ కాపీతో పాటు సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హతల, అనుభవం సర్టిఫికేట్లను జత చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ను Secretary, Sahitya Akademi, Rabindra Bhavan, 35, Ferozeshah Road, New Delhi-110001 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
Official Website పోస్టుల వివరాలు..

ఖాళీలు: 1
జీతం: రూ. 35, 400-రూ.1,12,400
వయస్సు: 40 ఏళ్లువిద్యార్హత: కామర్స్ లో డిగ్రీ చేసుండాలి. ఐదేళ్ల అనుభవం పొందిన వారై ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ పై బేసిక్ నాలెడ్జ్ ఉండాలి.

ఖాళీలు: 1
జీతం: రూ.25,500-రూ. 81,100
వయస్సు: 30 ఏళ్లు
విద్యార్హత: హిందీ, ఇంగ్లీష్ ఏదైనా ఒక సబ్జెక్టుగా కలిగిన గ్రాడ్జుయేట్లు, కంప్యూటర్ అప్లికేషన్లపై నాలెడ్జ్ ఉన్న వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ప్రూఫ్ రీడర్ గా రెండేళ్ల అనుభవం ఉండాలి.

ఖాళీలు: 2
జీతం: రూ. 25,500-రూ. 81100
వయస్సు: 30 ఏళ్లు
విద్యార్హత: 10+2 పాసై ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ పై అవగాహన కలిగి ఉండాలి. స్టెనో గ్రాఫర్ గా ఏడాది పని చేసిన అనుభవం ఉండాలి. నిమిషానికి 80 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.

ఖాళీలు: 2
జీతం: రూ. 35,400-రూ.1, 12, 400
విద్యార్హత: లైబ్రరీ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ లైబ్రరీలో నాలెడ్జ్ ఉండాలి.

ఖాళీలు: 2
జీతం: రూ. 35,400-రూ. 1, 12, 400
వయస్సు: 40 ఏళ్లు
విద్యార్హత: ఏదైనా డిగ్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఏదైనా పబ్లిషింగ్ హౌస్, డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో మూడేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి.

ఖాళీలు: 3
జీతం: రూ. 56, 100-రూ. 1,77, 500
వయస్సు: 40
విద్యార్హత: లాంగ్వేజ్ లో పోస్టు గ్రాడ్యుయేట్ చేసిన వారు అర్హులు. హిందీ, ఇంగ్లీష్ లో మంచి నాలెడ్జ్ ఉండాలి. కాపీ ఎడిటింగ్ లో ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఇతర వివరాలను నోటిఫికేషన్ లో చూడవచ్చు.