Breaking News

బ్లూమ్‌బర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రధాని మోదీ


 భారత్‌ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశమని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పేర్కొన్నారు. పట్టణీకరణ, రవాణా, ఆవిష్కరణలు, పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల వంటి విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి మరింత ఆకర్షణీయ దేశంగా భారత్‌ ఉందని ఆయన అన్నారు. బ్లూమ్‌బర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరమ్‌ను ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► భారత్, కొన్ని ఆఫ్రికన్‌ దేశాలు రానున్న రెండు దశాబ్దాల్లో భారీ పట్టణీకరణ విప్లవాన్ని చూడనున్నాయి. పట్టణీకరణలోకి పరివర్తన చెందే క్రమంలో భారత్‌ ముందడుగు వేస్తోంది.