Breaking News

మిస్సింగ్ కేసులపై ఆందోళన వద్దు : సైబరాబాద్ సీపీ సజ్జనార్


 హైదరాబాద్ మిస్సింగ్ కేసులపై ఆందోళన వద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. మిస్సింగ్‌ కేసులపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు. ఈ కేసుల గురించి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. చాలామంది వ్యక్తిగత సమస్యల కారణంగానే ఇంట్లోంచి వెళ్లిపోతున్నట్లు వివరించారు.వ్యవస్థీకృత పద్ధతిలో ఈ మిస్పింగ్ కేసులు జరగటం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి మిస్సింగ్‌ కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సరికొత్త పద్ధతులు అవలంబిస్తున్నామని తెలిపారు.