Breaking News

తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాలకు శ్రీకారం


 హైదరాబాద్ నగరంలోని బస్తీవాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాలకు శ్రీకారం చుట్టింది. గత నెలలో కొన్ని దవాఖానాలకు ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు మరికొన్నింటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డివిజన్‌కు రెండు చొప్పున 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీలో అధికారులు ఇప్పటికే 200 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. వీటికితోడు మరో 24 బస్తీ దవాఖానాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించనున్నారు.