Breaking News

రాష్ట్రంలో పెరిగిన అటవీ శాతం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి మేడ్చల్‌,  : రాష్ట్రంలో అడవుల శాతం క్రమంగా పెరుగుతున్నదని, సీఎం కేసీఆర్‌ అటవీ శాఖను బలోపేతం చేస్తున్నారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. పోలీసు, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయడంతో కలప అక్రమ రవాణా 99శాతం తగ్గిందని వివరించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు కండ్లకోయ జంక్షన్‌ సమీపంలో 3 ఎకరాల విస్తీర్ణంలో రూ.65లక్షలతో నిర్మించిన మేడ్చల్‌ జిల్లా అటవీ శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం రూ.25 లక్షల వ్యయంతో నిర్మించే అటవీ శాఖ అధికారుల నివాస గృహ సముదాయానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.