Breaking News

శాంసంగ్ కొత్త ఫోన్ లాంఛ్..


 మార్కెట్ లో సరికొత్త ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొనడానికి ప్రజలు కొనడం కన్నా కూడా కంపెనీలు కొత్త ఆఫర్లను, అదిరిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.. అయితే అలాంటి బంపర్ ఆఫర్ తో శాంసంగ్ మరో కొత్త ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేశారు.. ఆ ఫోన్ ధర ఫీచర్స్ నిజంగా చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగి పోవాల్సిందే..


ఆ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఏ52 5జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. SM-A526B మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ ఆన్ లైన్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది.

6 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించనున్నారు.. ఇంకో విషయమేంటంటే ఈ ఫోన్ వెనుక వైపు నాలుగు కెమెరాలు ఉన్నట్లు తెలుస్తోంది..స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్‌లో కనిపించిన విషయాన్ని ఒక ట్వీటర్ యూజర్ తెలిపారు. ఈ ఫోన్ సింగిల్ కోర్‌ టెస్టులో 298 పాయింట్లు, మల్టీకోర్ టెస్టులో 1,001 పాయింట్లను సాధించింది. జీఎస్ఎం ఎరీనా తెలిపిన దాని ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఏ51 5జీ సింగిల్ కోర్ టెస్టులో 700 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 1,800 పాయింట్లను సాధించింది. అయితే ఇది ప్రీ-ప్రొడక్షన్ మోడల్ కూడా అయ్యే అవకాశం ఉంది. లాంచ్ అయ్యే మోడల్ పెర్ఫార్మెన్స్ వచ్చిన ఫోన్ ఇంకా మెరుగ్గా ఉంటుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేశారు..

ఈ ఫోన్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ ఏ51 5జీ తర్వాత వచ్చిన వచ్చింది.అయితే ఈ ఫోన్ లో మరో ప్రత్యేకత కూడా ఉంది..మైక్రో కెమెరాను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది..జూమ్ లెన్స్‌ను మాత్రం ఇందులో అందించడం లేదు. ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ కెమెరాతో రానుందని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ51 5జీలో 48 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 2021లో లాంచ్ కానున్న గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్లలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా అందించనున్నట్లు సమాచారం.ఈ ఫోన్ ను ఈ ఏడాది చివరిలో కానీ, 2021 మొదట్లో కానీ లాంఛ్ చేసే ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది..