Breaking News

`వకీల్ సాబ్`కి కొత్త తలనొప్పి


 క్రేజీ సినిమాలకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలుసుకోవాలని వీడియో ఆడియో క్లిప్పింగులు వినాలని అభిమానుల్లో కుతూహాలం ఉంటుంది. ఉత్కంఠను పెంచే మ్యాటర్ ఇది. అందుకే సోషల్ మీడియాల్లో ఇలాంటి లీకులు బయటపడిపోతుంటాయి. కొందరు తెలిసిన వాళ్లో లేక తెలియని వారి ద్వారానో లీకులు బయటికి వచ్చేసరికి ఒక్కసారిగా చిత్రబృందం ఖంగు తినడం అటుపై లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించడం చూస్తున్నదే.ఇంతకుముందు పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది.. ఆ తర్వాత దేవరకొండ నటించిన ట్యాక్సీవాలా.. ఎన్టీఆర్ అరవింద సమేత ఇవన్నీ కూడా లీకుల బెడదను తీవ్రంగా ఎదుర్కొన్నవే. చాలా సినిమాలకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది.

పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇంతకుముందు సినిమా కోసం ఏర్పాటు చేసిన కోర్టు సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఇది అభిమానులకు శుభవార్త. అయితే ఊహించని విధంగా వకీల్ సాబ్ కి కొత్త బెడద ఎదురవుతోందట. యథావిధిగా పవన్ కి లీక్ లతో తలనొప్పి కూడా మళ్లీ ప్రారంభమైంది. గతంలో వకీల్ సాబ్ చిత్రీకరణ ప్రారంభించినప్పుడు కూడా ఇలానే అయ్యింది. ఇప్పుడు మళ్లీ రిపీటవుతోంది.

పవన్ కళ్యాణ్ నటించిన వీడియో క్లిప్ లు ఫోటోలతో ఇంటర్నెట్ షేక్ అవుతోంది. అయితే లీకుల కట్టడికి దర్శకనిర్మాతలు ఏం చేస్తారు? అన్నది చూడాలి. లీకులతో సస్పెన్స్ ఓపెనైపోతుంది. అప్పుడు థియేటర్లలో ఆడియెన్ కి కిక్కేం ఉంటుంది? అందుకే మేకర్స్ కాస్త కంగారు పడే పరిస్థితి ఉంటుంది.

ఇక వకీల్ సాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. దసరాకి లేదు కాబట్టి క్రిస్మస్ కానీ సంక్రాంతికి కానీ రిలీజ్ చేస్తారా? అన్నది చూడాలి. ఈ చిత్రంలో అంజలి- నివేదా థామస్ - అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి రిలీజ్ ప్లాన్ ఉన్నా... అప్పటికి మహమ్మారీ భయాలు తొలుగుతాయా? అన్నదానిని బట్టి అందరి ఫేట్ నిర్ణయమవుతుంది.