Breaking News

మరోసారి వార్తల్లో సీనియర్ సింగర్ సునీత


 సీనియర్ సింగర్ సునీత పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. 42 సంవత్సరాల ఆమె త్వరలో మళ్లీ పెళ్లి చేసుకోబోతోందంటూ విరివిగా ప్రచారంలోకి వచ్చింది. గతంలోనూ ఆమె పెళ్లి వార్తలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. అప్పుడు వాటిని ఆమె ఖండించారు. ఇప్పుడు మళ్లీ ఆ వార్తలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంతదాకా సునీత వాటికి స్పందించలేదు. దశాబ్ద కాలంగా ఆమె ఇద్దరు పిల్లలకు సింగిల్ మదర్‌గా ఉంటూ వస్తున్నారు.

టీవీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ కిరణ్ ఆమె మాజీ భర్త. ఆ ఇద్దరికీ ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఇప్పుడు వాళ్లు టీనేజ్ కూడా దాటేశారు. 2018లో ఓసారి సునీత ప్రేమలో పడ్డారనీ, రెండో పెళ్లి చేసుకోబోతున్నారనీ ప్రచారంలోకి వచ్చింది.

అయితే అందులో ఎలాటి నిజం లేదని ఆమె ఖండించారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన "ఈవేళలో నీవు ఏం చేస్తు ఉంటావో" పాటతో గాయనిగా పరిచయమై, తొలి పాటతోటే అందరి దృష్టినీ ఆకర్షించారు సునీత ఉపద్రష్ట. ఇటీవల '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' చిత్రంలో సిద్ శ్రీరామ్‌తో కలిసి ఆమె పాడిన "నీలి నీలి ఆకాశం" సాంగ్ 150 మిలియిన్ మార్క్‌ను దాటి సెన్సేషనల్ హిట్టయింది.