Breaking News

లక్ష్మణ్‌ కోచ్‌ అశోక్‌ మృతి


 హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, ఎమ్మెస్కే ప్రసాద్‌కు తొలి నాళ్లలో కోచ్‌గా వ్యవహరించిన అశోక్‌ సింగ్‌ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అశోక్‌ సోమవారం తుదిశ్వాస విడిచినట్లు కొడుకు ఆనంద్‌ సింగ్‌ తెలిపాడు. బ్రెయిన్‌ క్యాన్సర్‌కు శస్త్రచికిత్స తర్వాత 14 నెలల పాటు మృత్యువుతో పోరాడిన తండ్రి ప్రాణాలు వదిలారని చెప్పుకొచ్చాడు. 30 ఏండ్ల పాటు కోచ్‌గా వ్యవహరించిన తన తండ్రి లక్ష్మణ్‌, ఎమ్మెస్కేతో పాటు ఎంతో మంది యువ క్రికెటర్లకు తర్ఫీదు ఇచ్చారని అన్నాడు. హైదరాబాద్‌ రంజీ జట్టుకు ఎంపికైనా అశోక్‌.. అరంగేట్రం చేయలేకపోయారు.