Breaking News

మీరు బోర్లా పడుకుంటారా.. అయితే జాగ్రత్త సుమీ..!


 చాల మందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. అయితే ఇలా పొట్టవైపునకు తిరిగి పడుకోవడం చాలా ప్రమాదమనీ.. దాని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతోందని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా ప్రమాదం.. దానికి కారణాలు ఏంటో చూద్దామా. బోర్లా పడుకోవడం అంటే మనం మన పొట్ట మీద భారం వేసి పడుకుంటున్నాం అన్నమాట. దీని వల్ల పలు స్పల్పకాలిక, దీర్షకాలిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయట. ఇలా చేయడం మంచిది కాదని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయని స్లీపింగ్ ఓషియన్ వ్యవస్థాపకుడు, స్లీప్ సైన్స్ కోచ్ అలెక్స్ సేవీ అంటున్నారు.


బోర్లా పడుకుని నిద్రపోతున్నప్పుడు వెన్నుముక తన సహజ వక్రతను కోల్పోతుందట. దీని వల్ల ఒత్తిడి పెరిగి వెన్నుముక అధిక శ్రమకు గురవుతుందంటున్నారు.

వెనుక కండరాలు కూడా దెబ్బతిని ఉదయాన్నే వెన్నునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. పొట్టవైపుకు తిరిగి పడుకోవడం వల్ల హైపర్లార్డాసిస్ వంటివి మొదలై వెన్ను చివర్లో నొప్పులు మొదలవుతాయట. పొట్టవైపుకు తిరిగి పడుకున్నప్పుడు మనం ఊపిరి తీసుకోవాడానికి మెడను ఏదో ఒకవైపుకు తిప్పి ఉంచుతాం. దీని వల్ల మన మెడ వెన్నుముక మధ్య సంబంధాలు చెడిపోతాయట. మెడ ఒకపక్కకు తిప్పి ఉంచడం వల్ల ఒకవైపు గట్టిపడి.. మరో వైపె బలహీనమవుతుందట. దీని వల్ల మెడ పట్టుకోవడం.. మెడ నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయట.

బోర్లా పడుకోవడం వలన నడుంని వెనక్కి తిప్పి ఉంచుతాం కాబట్టి, లాంబర్డో పాయింట్ మీద వెయిట్ పడుతుంది. ఫలితంగా వెన్ను చివరి భాగంలో వంపుపై భారం పడి నొప్పి పెరుగుతుంది. ఫలితంగా మున్ముందు డిస్క్ సమస్యలు కూడా రావొచ్చు. బోర్లా పడుకున్నప్పుడు వచ్చే సమస్యల్లో హెర్నియా డిస్క్ సమస్య మరొకటి. వెన్నెముకలో పగుళ్లు ఏర్పడి జిగురు తగ్గిపోవచ్చు. పొట్టవైపుకు తిరిగి పడుకునే ముందు మీతల, మెడ భాగాలపై ఒత్తిడి పడకుండా ఉండేలా ఓ దిండును ఏర్పరుచుకోండి. మీ కాళ్ల కింద కూడా ఓ దిండు ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల వెన్నుముక సమస్యలు రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయట.