Breaking News

వేపాకుల చూర్ణం


 మన అందాన్ని కురులతో కూడా పోల్చి చూస్తుంటారు. కురులు వత్తుగా నల్లగా ఉంటే మంచి ఆరోగ్యంగా కూడా ఉన్నట్లే. ఒక వేళ జుట్టు కునక నల్లగా లేకుండా తెల్లగా మారితే అనారోగ్య సమస్యలో లేక కేశాల్లో లోపా1లో రక రకాల బాధలు వెంటాడుతుంటాయి.

తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవాలని అందరికి ఉంటుంది. కాని తోందరపాటు వల్ల షాంపులు వాడడం వల్ల జుట్టు నల్లబడకుండా, మరో సమస్య చుండ్రు రావడం మొదలౌవుతుంది. కొన్ని ప్రాంతాలలో నీళ్లు సమస్య వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది.వంశపారంపర్య లక్షణాల మూలంగా కూడా జుట్టు తెల్ల బడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆహారలోపాలు, ఒత్తిడి వంటివన్నీ దీనికి కారణం. ఇక నేటి వాతావారణ కాలుష్యం కూడా దీనికి ఓ కారణం.

తీసుకునే ఆహారంలో లోపాలు, థైరాయిడ్‌ సమస్య, మా నసిక ఒత్తిడి, ఆందోళన వంటివి పలు కారణాలు కావచ్చు.
ఒకప్పుడు కేవలం ముసలి వాళ్ళకి మాత్రమే తెల్ల వెంట్రుకలు వస్తుండేవి. కానీ ఇప్పుడు రకరకాల డిటర్జెంట్స్ వాడటం వల్ల ముసలి వాళ్ళని పక్కన పెడితే, ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి యవ్వనప్రాయం వరకూ ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో ప్రతి ఒక్కరికి తెల్ల వెంట్రుకల సమస్య ఎదురౌతుంది.
అయితే వాటిని కనబడనివ్వకుండా ప్రతి ఒక్కరూ రకరకాల హెన్నాలను వాడుతుంటారు. వాటి వాడటం వల్ల ఆరోగ్యానికి హానికరం. కానీ వాటిని ఉపయోగించకుండా ఉండలేరు. అలాగేని లేనిపోని సమస్యలు తెచ్చుకోకూడదు కాబట్టి, కొన్ని న్యాచురల్ రెమెడీస్ ను ఉపయోగించడం మంచిది. మరి అవేంటో తెలుసుకుందాం..
యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్
కరివేపాకు
కేవలం ఒక కట్ట తాజా కరివేపాకులను పొడి చేసి, నీటితో పేస్టులాగ చేసి, 2 కప్పుల కొబ్బరి నూనెను దానికి కలిపి, ఆ మిశ్రమంలోని తేమ ఆవిరయ్యే వరకు వేడి చేసి, చల్లర్చిన తర్వాత ఒక సీసాలో భద్ర పరచుకోవాలి. వారంలో రెండు సార్లు తలకి ఈ మిశ్రమాన్ని వాడితే క్రమంగా వెంట్రుకలు తెల్లబడే సమస్య నుంచి నివారణ పొందగలరు

యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్
తెల్ల జుట్టు నివారణకు వేపాకు
రెండు టీ స్పూన్ల వేపాకుల చూర్ణం, రెండు టీ స్పూన్ల మెంతుల చూర్ణం, నాలుగు టీ స్పూన్ల బ్రాహ్మి చూర్ణం, నాలుగు టీ స్పూన్ల చందనం చూర్ణం, నాలుగు టీ స్పూన్ల శీకాకాయ చూర్ణం, ఆరు టీ స్పూన్ల కుంకుడు కాయల చూర్ణం తీసుకొని పక్కన పెట్టుకొని. ముందుగా అన్ని రకరకాల చూర్ణాలు కలిసిపోయేలా కలపాలి. ఆ కలిపినా చూర్ణం ఒక స్టీలు గిన్నెలో వేసి చూర్ణం మునిగే వరకు నీళ్ళుపోయాలి. తర్వాత చిన్నమంటమీద కొధిగా వేడి చేయాలి. ఈ విధంగా చేస్తే పేస్టులాగా తయారవుతుంది. ఇలా తయారైన పేస్టును నెమ్మదిగా జుట్టు కుదుళ్ళకు మరియు జుట్టుకు మంచిగా పట్టించి జుట్టును ఆరనివ్వాలి. తర్వాత శుభ్రమైన నీళ్ళతో స్నానం చేయాలి. ఇలా స్నానం చేసేటప్పుడు వేరే షాంపూను ఉపయోగించనవసరం లేదు.

యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్
తెల్ల జుట్టు నివారణకు కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి వాటర్ లా బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా మసాజ్ చేయాలి . ఇది తెల్లజుట్టుకు మసాజ్ థెరఫీలా పనిచేసి తెల్ల జుట్టును నివారిస్తుంది. ఒక్కో రాశిలో దాగున్న వ్యక్తిగత లక్షణాలు..! వినాయకుడికి 'నెమళ్ళ దేవుడు' అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? హెయిర్ ఫాల్ తగ్గించి, హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హోం మేడ్ రిసిపిలు

యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్
తెల్ల జుట్టు నివారణకు హెన్న:
గోరింటాకు మీ జుట్టుకు నేచురల్ కలర్ ను అందిస్తుంది . ఇది తలకు ఒక నేచురల్ షైనీ కలర్ అందివ్వడం మాత్రమే కాదు, డ్యామేజ్ జుట్టును నివారిస్తుంది. ఆమ్లా: ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి . ఎండిన ఉసిరికాయ ముక్కల్ని నూనెకు మిక్స్ చేయాలి . ఇప్పుడు నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే తప్పనిసరిగా వ్యత్యాసమును గమనించగలుగుతారు.

యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్
తెల్ల జుట్టు నివారణకు మెంతులు :
తెల్ల జుట్టును నివారించే మరో సహజ హోం రెమడీ మెంతులు గుప్పెడు మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఈ నీటిని తలస్నానం చేయడానికి ఉపయోగించండి. అలాగే మరో రెమెడీ ..హెన్న మెంతి పొడి: రెండు టేబుల్ స్పూన్ల హెన్న పౌడర్ లో ఒక టీస్పూన్ మెంతి పొడి , ఒక టీస్పూన్ పెరుగు, ఒక టీస్పూన్ కాఫీ పౌడర్, 2 టీస్పూన్ల మింట్ జ్యూస్, 2 టీస్పూన్ల తులసి రసం అన్నింటిని మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను తలకు పట్టించి 2 నుండి 4 గంటల తర్వాత తలస్నానం చేసుకోవాలి

యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్
తెల్ల జుట్టు నివారణకు కర్పూరం :
ఒక టేబుల్ స్పూన్ కర్పూరం పొడిని కొబ్బరి నూనెలో కలుపుకొని ప్రతి రోజూ తలకి మసాజ్ చేసినా ఫలితం ఉంటుంది. ఇలా రోజూ చేసే ఓపిక ఎక్కడిది అంటారా అయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి.

యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్
తెల్ల జుట్టు నివారణకు కోడిగుడ్డు, కీరదోస :
ఓ కోడిగుడ్డు, కీరదోస, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను మిక్సీలో వేసి పేస్టులా చేయండి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి పదిహేను నిమిషాలపాటు ఉంచి తర్వాత షాంపూ చేసుకోండి. నెలకోసారి ఇలా చేయడం వల్ల జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. తెల్ల జుట్టు రావడం తగ్గుతుంది.

యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్
తెల్ల జుట్టు నివారణకు ఆమ్లా పేస్ట్:
రెండు మూడు ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, పేస్ట్ లా చేసి తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్
తెల్ల జుట్టు నివారణకు మందార ఆకుల పేస్ట్:
మందార ఆకుల పేస్ట్ ను తలకు పట్టించి అర్ధగంట తర్వాత తలస్నానం చేస్తే వైట్ హెయిర్ రాకుండా ఉండడమే కాకుండా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. అలాగే మందార పువ్వులను ఎండబెట్టి ఆ పొడిని ఆల్ మండ్ ఆయిల్ తో కలిపి రాత్రి పూట తలకు అప్లై చేయాలి. ఉదయాన్నే హెడ్ బాత్ చేయడం వల్ల తెల్లబడ్డ జుట్టు కూడా క్రమేపి నల్లబడుతుందని హెయిర్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు