Breaking News

ఎట్టకేలకు హిట్ కొట్టింది


 ఎన్నో ఆశలతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది తమిళ బ్యూటీ వర్ష బొల్లమ్మ. అయితే మొదటి ఛాన్స్ ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. ఎట్టకేలకు తాజాగా విడుదలైన మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.

మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాలో సంధ్య పాత్రలో నటించింది వర్ష బొల్లమ్మ. ఆనంద్ దేవరకొండకు మరదలి పాత్ర ఇది. ఈ క్యారెక్టర్ లో ఆమె జీవించింది. ఎన్నో సన్నివేశాల్లో కేవలం కళ్లతోనే హావభావాలు పలికి. శభాష్ అనిపించుకుంది. యాక్టింగ్ కు తోడు సినిమా కూడా హిట్టవ్వడంతో వర్షకు మంచి పేరొచ్చింది.

నిజానికి ఈ సినిమా కంటే ముందు ఆమె జానుపై చాలా ఆశలు పెట్టుకుంది. శర్వానంద్-సమంత నటించిన ఆ మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది వర్ష.

కానీ ఆ సినిమా నిరాశపరిచింది. మళ్లీ షార్ట్ గ్యాప్ తర్వాత మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ.