Breaking News

ట్రంప్‌పై బైడెన్ పైచేయి..


 వాషింగ్టన్‌: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రాష్ట్రాల వారీగా వెలువడుతున్నాయి. డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై పైచేయి సాధించారు. ఇప్పటికే ఫలితాలు వెలువడిన రాష్ట్రాల్లో ట్రంప్ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించగా, బైడెన్ ఐదు రాష్ట్రాల్లో గెలుపొందారు. మరో నాలుగు రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వెస్ట్ వర్జీనియా, కెంటకీ, ఇండియానా, సౌత్ కరోలైనా రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా, వర్జీనియా, వెర్మాంట్‌, మేరిల్యాండ్, న్యూజెర్సీ, మసాచుసెట్స్ రాష్ట్రాల్లో బైడెన్ జయకేతనం ఎగురవేశారు. అదేవిధంగా టెక్నాస్‌, జార్జియా, ఫ్లోరిడా, న్యూ హ్యాంషైర్ రాష్ట్రాల్లో బైడెన్ ఆధ్యిక్యంలో కొనసాగుతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ ఇంకా కొనసాగుతున్నది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికలు ముగియగా, దక్షిణాది రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. అధ్యక్ష ఎన్నికల్లో గత వందేండ్లలో ఎప్పుడూ లేనంతగా అత్యధిక ఓటింగ్ నమోదవుతున్నది. దేశంలో మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇందులో 270 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నవారు అధ్యక్షపదవిని సొంతం చేసుకోనున్నారు. కాలిఫోర్నియాలో అత్యధికంగా 55 ఓట్లు ఉండగా, టెక్నాస్‌లో 38, న్యూయార్క్‌లో 29, ఫ్లోరిడాలో 29, పెన్సిల్వేనియాలో 20, ఇల్లినాయిస్‌లో 20 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, 30 రాష్ట్రాల్లో 10 కంటే తక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.