Breaking News

అనసూయపై జబర్దస్త్ వర్ష షాకింగ్ కామెంట్స్


 జబర్దస్త్ వేదిక ఎంతోమందిని పాపులర్ చేసింది. గత కొన్నేళ్లుగా ఎంతోమంది కమెడియన్స్ ఈ వేదికపై టాలెంట్ నిరూపించుకొని అద్భుతమైన కెరీర్ కొనసాగిస్తున్నారు. అనసూయ, రష్మీ యాకరింగ్ రోజా నవ్వులతో జబర్దస్త్ వేదిక ఎప్పుడూ కలర్‌ఫుల్ గానే ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ వేదికపై ఓ అందం తళుక్కున మెరుస్తోంది. ఆమెనే వర్ష. వరుస స్కిట్స్ చేస్తూ బుల్లితెర ఆడియన్స్‌ని గిలిగింతలు పెడుతున్న ఈ బ్యూటీ.. ఏకంగా అనసూయపై షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

చాలా రోజుల క్రిందట ఓ బాలుడు అనసూయ వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకుంటుంటే.. ఆమె ఆ సెల్ ఫోన్ తీసి క్రిందకొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ బాలుడి తల్లి పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ ఇష్యూ బాగా వైరల్ అయి అనసూయపై ట్రోల్స్ జరిగాయి. అయితే ఇదే ఇష్యూపై ఓ వీడియో ద్వారా అనసూయకు క్లాస్ పీకుతూ రెచ్చిపోయింది జబర్దస్త్ వర్ష. ఈ వీడియో ఇప్పటిదేనా లేక గతం లోనిదేనా అనేది తెలియరాలేదు కానీ ఇందులో వర్ష మాట్లాడిన తీరు మాత్రం సంచలనంగా మారింది.

అనసూయ ప్లేస్‌లో వేరే హీరో గానీ, హీరోయిన్ గానీ ఉండి.. ఆ బాలుడి ప్లేస్‌లో అనసూయ పిల్లలు ఉంటే అనసూయకు బాధ అనిపించదా అని ప్రశ్నిస్తూ మనసులో ఏమీ ఉంచుకోకుండా అన్నీ కక్కేసింది వర్ష. ఆ క్షణంలో ఆ బాలుడు, బాలుడి తల్లి ఎంత బాధపడిందో అనసూయకు తెలుసా? ప్రేక్షకులు లేనిది నువ్వెక్కడ ఉంటావ్ అంటూ జబర్దస్త్ కౌంటర్స్ వేసింది. చిన్న పిల్లల దగ్గర ఎలా బెహేవ్ చేయాలో నేర్చుకోండి అనసూయ గారు. అలాగే సోషల్ మీడియాలో కూడా అభిమానులు పెట్టే కామెంట్లకు రాష్‌గా సమాధానం చెప్పడం మానుకుంటే మంచిందని చెబుతూ రెచ్చిపోయింది వర్ష.

మాట్లాడేటప్పుడు కాస్త చూసుకొని మాట్లాడండి. ఫేస్‌బుక్కుల్లో ఫాలో అయ్యేది, మీతో సెల్ఫీలు దిగాలనుకునేది మీ ఫ్యాన్సే. దయచేసి చిన్నపిల్లపై ఇలాంటి దౌర్జన్యాలు చేయకండి అనసూయ గారు. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను అని ముగించింది వర్ష. పాతదా, కొత్తదా అని పక్కనబెడితే జబర్దస్త్ తెరపై వర్షకు గుర్తింపు వచ్చాక ఈ వీడియో వైరల్ అవుతుండటం గమనార్హం.

ఇకపోతే.. బుల్లితెర యాంకర్‌గా ఫుల్ పాపులారిటీ సంపాదించిన అనసూయ వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. ఏ చిన్న అవకాశం దొరికినా తన టాలెంట్ బయటపెడుతూ దర్శకనిర్మాతలను అట్రాక్ట్ చేస్తోంది. 'రంగస్థలం'లో రంగమ్మత్తగా పవర్‌ఫుల్ రోల్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ' సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది.