Breaking News

బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ భేటీ!


 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల లెక్కింపు, ఫలితాలపై ఉంది. అయితే ఇంతలోనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో మహాఘట్ బంధన్‌కే విజయావకాశాలు ఉన్నట్లు వెల్లడయ్యింది. మహాఘట్ బంధన్‌లో భాగస్వామ్యం కలిగిన కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు రాగానే యాక్టివ్ అయిపోయింది. పలు ఎగ్జిట్ పోల్స్‌లో మహాఘట్ బంధన్‌కు సంపూర్ణ విజయం దక్కుతుందనే అంచనాలు వెలువడ్డాయి.

ఈ పరిణామాల నేపధ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూరజ్‌వాలా, అవినాష్ పాండెలను బీహార్ అబ్జర్వర్లుగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమించారు. ఈ నేపధ్యంలో వీరిరువురూ పట్నా చేరుకున్నారు.

పార్టీలో నేతలందరి మధ్య సమన్వయాన్ని కుదిర్చే బాధ్యతను పార్టీ ఈ ఇద్దరు అగ్రనేతలకు అప్పగించింది. దీంతో వీరు పట్నాలోని కాంగ్రెస్ కార్యాలయంలో బీహార్ యూనిట్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు.