Breaking News

రెండున్నర లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య


 తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే గత కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 900లకు చేరువలో కేసులు నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( నవంబరు 21న ) శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 873 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం..

తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,63,526 కి చేరగా.. మరణాల సంఖ్య 1,426 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

గత 24గంట్లలో ఈ వైరస్ నుంచి 1,296 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,50,453 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 11,643 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.03 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది.