Breaking News

క్యూబా, ఇరాన్‌లు రెండూ అమెరికా ప్రభుత్వ


 క్యూబా, ఇరాన్‌లు రెండూ అమెరికా ప్రభుత్వ ఆంక్షలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పరస్పర సంఘీభావం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నట్టు క్యూబా అధికార వార్తాపత్రిక గ్రాన్మా శుక్రవారం తెలిపింది. అమెరికా ఆంక్షలు తమ సంకల్పాన్ని చెదరగొట్టలేవని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీఫ్‌ క్యూబా లో పర్యటిస్తున్నారు. 2018లో ట్రంప్‌ ప్రభుత్వం ఇరాన్‌ అణు ఒప్పందం నుండి వైదొలగింది. ఇరాన్‌ చమురు ఎగుమతి సామర్ధ్యాన్ని దెబ్బతీసేలా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకుఉ ఆంక్షలు విధించింది. 1962 నుండి క్యూబాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతునే వున్నాయి.

వాటిని మరింత తీవ్ర స్థాయిలో అమలు చేసేలా మరో 130కి పైగా చర్యలను ట్రంప్‌ సర్కార్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్యూబా,ఇరాన్‌ విదేశాంగ మంత్రులు సమావేశమై చర్చలు జరిపారు. సామాజిక, ఆర్థికాభివృద్ధికి అణు ఇంధనాన్ని, సాంకేతికతను శాంతియుతంగా ఉపయోగించడానికి క్యూబా ఎప్పుడూ మద్దతిస్తుందని గ్రాన్మా పేర్కొంది. ఇరాన్‌తో అణు ఒప్పందం నుండి ఏకపక్షంగా వైదొలగడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. దేశాల మధ్య సహజీవన నిబంధనలను అమెరికా నిర్ణయం ఉల్లంఘిస్తోందని విమర్శించింది.