Breaking News

యువ వికెట్ కీపర్ రేసులో యువ ఆటగాడు


 టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌తో వికెట్ కీపర్ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ధోనీ వారుసుడిగా చాలా అవకాశాలందుకున్న యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆరంభంలో అదరగొట్టిన ఆ తర్వాత పూర్తిగా తేలిపోయాడు. నిరాశజనక ప్రదర్శనతో చివరకు జట్టులోనే చోటు కోల్పోయాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌ను కీపర్‌గా ప్రయోగించగా అతను ఆ అవకాశాన్ని రెండు చేతులతో అందుకున్నాడు. అటు వికెట్ల వెనుకాల ఇటు బ్యాట్స్‌మన్‌గా అదరగొట్టాడు.తాజా ఐపీఎల్ 2020 సీజన్‌లో తనదైన శైలిలో చెలరేగాడు. ఇక విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడే సంజూ శాంసన్‌కు పెద్దగా అవకాశాలు రాకున్నా.. వచ్చిన వాటిని అందిపుచ్చుకోలేకపోయాడు.

పైగా ఈ ఐపీఎల్‌లో కూడా తన పాత కథనే రిపీట్ చేశాడు. రెండు, మూడు మ్యాచ్‌లు మినహా మిగతా వాటిలో దారుణంగా విఫలమయ్యాడు.