Breaking News

ఎన్‌కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతం


 జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లా పాంపొరిలోని లాల్ పొరా గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. లాల్ పొరా గ్రామంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీరు పోలీసులు కేంద్ర భద్రతా బలగాలతో కలిసి గురువారం రాత్రి గాలింపు చేపట్టారు. గాలిస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గాయపడ్డారు.ఈ ఎన్‌కౌంటర్ లో గుర్తుతెలియని ఉగ్రవాది ఒకరు మరణించారని జమ్మూకశ్మీరు పోలీసులు చెప్పారు. ఉగ్రవాదుల కోసం శుక్రవారం కూడా గాలింపు కొనసాగుతుందని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు.

శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.