Breaking News

వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు


 ఢిల్లీలో కరోనా కేసులు పెరుగున్న దృష్ట్యా సీఎం కేజ్రీవాల్ మరోమారు పాక్షిక లాక్‌డౌన్ విధించాలని తీసుకున్న నిర్ణయాన్ని అత్యధిక వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఇంతకుముందు లాక్‌డౌన్ విధించినప్పుడే పలు సమస్యలు ఎదుర్కొన్నామని, అందుకే మరోమారు లాక్‌డౌన్ విధించవద్దని వారు కోరుతున్నారు.

ఈ సందర్భంగా సరోజినీ నగర్ బజార్ సంఘం సభ్యులు అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వం తమను బలిఇచ్చే పశువులుగా మారుస్తున్నదని ఆరోపించారు. పండుగల సీజన్‌లో వ్యాపారంలో కొద్దిగా తేరుకున్నామనేంతలో మరోమారు మార్కెట్లు మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తాము కోవిడ్-19 సోకకుండా ఉండేందుకు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడంతోపాటు, మాస్కులు ధరిస్తున్నామని, శానిటైజేషన్ చేస్తున్నామని తెలిపారు.

కరోనా కట్టడికి పూర్తిగా లాక్ డౌన్ విధించడం సరికాదన్నారు.