Breaking News

మాజీ ఎమ్మెల్యే కొడుకు దుర్మరణం


 యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మోజిగూడం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పక్కన ఆగి ఉన్న స్కూటీని కారు ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌ వలీ కుమారుడు షారూక్‌ దుర్మరణం చెందాడు. చలి కారణంగా రోడ్డు పక్కకు స్కూటీని ఆపి స్వెటర్‌ వేసుకుంటుండగా ఒక్కసారిగా కారు దూసుకొచ్చింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ షారూక్‌ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చౌటుప్పల్‌ పోలీసులు. మృతుడు షారూక్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకి చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి కుమారుడుగా గుర్తించారుమస్తాన్ వలి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నాడు.

దీంతో ఏపీ కాంగ్రెస్ లో తీవ్ర విషాదం నెలకొంది