Breaking News

Whatsappకి బదులు శక్తివంతమైన యాప్ వచ్చింది!


 Whatsapp, Telegram వంటి మెసెంజర్ యాప్స్‌తో రహస్య సమాచారాన్ని కమ్యూనికేట్ చేసుకోవడం వల్ల దేశానికి సంబంధించిన కీలకమైన సమాచారం ప్రమాదంలో పడుతుంది అన్న భావనతో ఇండియన్ ఆర్మీ Whatsapp మాదిరి సదుపాయాలు కలిగి ఉండే SAI ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ తీసుకొచ్చింది.

Secure Application for the Internet లేదా SAI అనే పిలవబడే ఈ అప్లికేషన్ పూర్తిస్థాయిలో end2end encryption సదుపాయాన్ని కలిగి ఉండి భారత సైనికులు ఒకరికొకరు పంచుకునే సమాచారం మరింత సురక్షితంగా ఉండేలా కాపాడుతుందని.. ఇండియన్ ఆర్మీ ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా వెల్లడించింది. దేశవ్యాప్తంగా సైనిక అవసరాల కోసం దీనిని వినియోగించుకోబోతున్నారు.

SAI అప్లికేషన్లో వాయిస్, టెక్స్ట్, వీడియో కాలింగ్ సదుపాయాలు పొందుపరచబడి ఉంటాయి.

Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లలో దీనిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దేశీయంగా నెలకొల్పబడిన సర్వర్ల ద్వారానే కమ్యూనికేషన్ సాధ్యపడుతుంది. అందువలన డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఏ మాత్రం లేదని ఇండియన్ ఆర్మీ పేర్కొంటోంది. అలాగే భారతీయ ఆర్మీ అవసరాల కోసం ప్రత్యేకంగా కోడింగ్ చేసి ఈ అప్లికేషన్ రూపొందించారు. ఈ అప్లికేషన్ కు సంబంధించి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా నమోదు చేసే సమయంలో భారతీయ ఆర్మీ ఉంది.

ఇదిలా ఉంటే ఈ SAI మొబైల్ అప్లికేషన్ కేవలం ఆండ్రాయిడ్ మీద మాత్రమే కాకుండా, iOS ఆపరేటింగ్ సిస్టం మీద గూడా ఉపయోగించుకునే విధంగా దానికి సంబంధించిన డెవలప్మెంట్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ తాజా కమ్యూనికేషన్ అప్లికేషన్‌లో లభిస్తున్న సదుపాయాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరిశీలించి తమ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు భారతీయ ఆర్మీ పేర్కొంది. ఇటీవలికాలంలో కీలకమైన రక్షణ దళాల కమ్యూనికేషన్ చాలా ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఈ తాజా అప్లికేషన్ ఎంతోకొంత సైనిక దళాల కమ్యూనికేషన్‌కి ఉపకరిస్తుంది అనడంలో సందేహమే లేదు.