Breaking News

మ్యాన్‌కైండ్ ఫార్మా బ్రాండ్ అంబాసిడర్‌గా మోహన్‌లాల్


 ప్రముఖ ఔషధ సంస్థ మ్యాన్‌కైండ్ ఫార్మా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఆయన మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, హిందీ, తదితర భాషల్లో 400లు పైగా సినిమాల్లో నటించారు. 5 సార్లు జాతీయ స్థాయిలో, 6 సార్లు కేరళ ప్రభుత్వం, ఇతర సంస్థల ద్వారా ఉత్తమ నటుడిగా సత్కారం పొందారు. మోహన్‌లాల్‌ను మ్యాన్‌కైండ్ ఫార్మా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవడం ద్వారా దక్షిణాది ప్రజలకు మరింత చేరువ కావాలని లక్షంగా చేసుకుందని సంస్థ సిఇఒ రాజీవ్ జునేజా తెలిపారు.